AP: రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతనిచ్చే అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యాన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్, పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చించారు. మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.