దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. వ్యవసాయ పనులకు ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 23వ విడతగా రూ.2 వేలను జులైలో విడుదల చేయనుంది. లబ్ధిదారులు తమ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, లేదంటే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ తో కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్/యాప్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.