అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఇలా చేయకపోతే రూ.2,000లు కట్‌

29104చూసినవారు
అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఇలా చేయకపోతే రూ.2,000లు కట్‌
పీఎం కిసాన్ 23వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రూ.2,000 ఆర్థిక సాయం పొందాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేసి, భూమి రికార్డుల ధృవీకరణను సక్రమంగా చేయించుకోవాలంది. ఈ ప్రక్రియలు పూర్తి కాని రైతుల ఖాతాల్లో 23వ విడత నగదు జమ కాకపోవచ్చని హెచ్చరించింది. గత 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కాగా, 23వ విడత జూన్ లేదా జులైలో జమయ్యే అవకాశం ఉంది. రైతులు తమ స్టేటస్‌ను పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకుని వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. e-KYC పూర్తయితేనే నగదు అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్