సీషెల్స్ అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర
మోదీ ఆ దేశ రాజధాని విక్టోరియాలోని పీస్ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపు ఆశయాలు శాంతికి, మానవ గౌరవానికి ప్రతీకలని, అవి మెరుగైన ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని
మోదీ విక్టోరియాలోని చారిత్రాత్మక అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.