PM పోషణ్ స్కీమ్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్!

18804చూసినవారు
PM పోషణ్ స్కీమ్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పీఎం పోషణ్ (PM POSHAN) పథకాన్ని విస్తరించే దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10 రోజుల్లోగా తమ సూచనలు పంపాలని కేంద్ర విద్యాశాఖ లేఖ రాసింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు అమలవుతున్న ఈ పథకాన్ని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్