జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీపై ప్రధాని ప్రశంసలు

3958చూసినవారు
జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీపై ప్రధాని ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీని అభినందించారు. ఏడు దశాబ్దాల తర్వాత జమ్మూకశ్మీర్ జట్టు తొలి రంజీ ట్రోఫీని సాధించిందని, ఈ సీజన్‌లో 60 వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అతడి స్ఫూర్తితో మరికొంతమంది క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆకిబ్ నబీని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది.

సంబంధిత పోస్ట్