పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ఒక 'ఎక్స్' (ట్విట్టర్) పోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై సైనిక చర్యను వాయిదా వేయాలని కోరుతూ చేసిన ఈ సందేశంలో "Draft - Pakistan PM Message on X" అనే వాక్యాన్ని తొలగించడం మర్చిపోవడంతో, ఆయన స్క్రిప్ట్‌ను కాపీ-పేస్ట్ చేశారనే విషయం స్పష్టమైంది. ఈ పొరపాటు దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.