పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, ఆర్థిక, పరిపాలనా జాప్యాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో పనులు త్వరగా పూర్తవుతాయని, సమన్వయం మెరుగ్గా జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముంపు సమస్యలు, నీటి వాటా అంశాలపై తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు అభ్యంతరాలు తెలపడంతో పనుల పురోగతి నెమ్మదించింది. ప్రాజెక్టుపై పూర్తి నియంత్రణ ఉంటే నిధుల విడుదల సులభమవుతుందని, అధికార యంత్రాంగంలోని అడ్డంకులు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.