పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన, పోలవరం ప్రాజెక్టు 87% పూర్తయిందని, డయాఫ్రం వాల్ నిర్మాణం 1034 మీటర్ల వరకు పూర్తయిందని వెల్లడించారు. 2026 సాగు సీజన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, జనవరి మొదటి వారంలో సీఎం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారని, 456 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభిస్తారని తెలిపారు.