గుజరాత్‌లో లిక్కర్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. (వీడియో)

22161చూసినవారు
గుజరాత్‌ వడోదర శివార్లలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఓ హై-ప్రొఫైల్ లిక్కర్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు జరిపిన ఈ దాడుల్లో 80 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దాదాపు రూ.2.91 కోట్ల విలువైన లగ్జరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో విదేశీ మద్యం సీసాలను గుర్తించారు. ఈ పార్టీలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. గుజరాత్‌లో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి మద్యం పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్