దళిత యువకుడిపై పోలీసులు క్రూరత్వం: వైసీపీ ట్వీట్

12248చూసినవారు
AP: పల్నాడు జిల్లా, సాతులూరుకు చెందిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ చందుపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపించింది. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారాయుడు, నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు ఎలాంటి సమాచారం లేకుండా చందును అక్రమంగా నిర్బంధించి, కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. కుటుంబ సభ్యులు మాజీ మంత్రి విడదల రజిని సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. భయపడిన పోలీసులు అర్ధరాత్రి గాయాలతో ఉన్న చందును స్టేషన్ బయట వదిలి వెళ్లారని వైసీపీ విమర్శించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్