AP: విజయవాడలోని ధర్నాచౌక్‌లో రైతులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి వెళ్లేందుకు రైతులు యత్నించగా, ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు. ఈ సంఘటనతో రైతుల ఆందోళన తీవ్రమైంది.