అస్సాం CM హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‍పై
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రిణికి భుయాన్‍కు మూడు పాస్ పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పవన్ ఖేరాపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.