మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల కోసం పోలీసుల వేట

4242చూసినవారు
మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల కోసం పోలీసుల వేట
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో నిందితులైన ఆరుగురు అనుచరులు, గత 10నెలలుగా పరారీలో ఉన్నారు. వారిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఇప్పటికే ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరుకాగా, వారిని 15 రోజుల రిమాండ్‌కు పంపాలని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.