AP: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, పూర్తి కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీలు అందిస్తేనే విచారణకు వస్తానని కాకాణి స్పష్టం చేయడంతో, పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.