బెంగళూరులోని సిర్సీ సర్కిల్ వద్ద కే.పీ. అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక చిట్ ఫండ్ మోసం కేసులో నిందితుడిని చేర్చకుండా ఉండేందుకు ఆయన ఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు చుట్టుముట్టడంతో, తప్పించుకునేందుకు ప్రయత్నించి, ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.