AP: కడప జిల్లాలోని దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై తిరగబడిన స్మగ్లర్ జాకీర్‌పై కాల్పులు జరపగా.. అతడి కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో జాకీర్‌ను పోలీసులు కడప జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.