AP: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో నలుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, A28 తాండ్ర రమేష్ బాబు, A29 అల్లా బక్షులను ఎక్సైజ్ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులైన వీరిని పీటీ వారెంట్‌పై ఇబ్రహీంపట్నం నుంచి ప్రత్యేక భద్రత నడుమ తంబళ్లపల్లి కోర్టుకు తరలించారు.