AP: విజయవాడ మాజీ మేయర్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. నిరసనలో పాల్గొన్నందుకు బీసీ మహిళా నేత రాయన భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేశారని, శాప్ కార్యాలయం వద్ద ఆందోళన కేసులో నోటీసులు ఇచ్చేందుకు యత్నించారని తెలిసింది. రాత్రి సమయంలో పోలీసులు తమ ఇంటికి రావడాన్ని మాజీ మేయర్ దంపతులు ప్రశ్నించారు. బీసీ మహిళా నాయకురాలిని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.