పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు.. దీక్ష విరమించిన జేసీ

24చూసినవారు
పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు.. దీక్ష విరమించిన జేసీ
AP: తాడిపత్రి పోలీసులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ 196(1)BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన దీక్షను విరమించారు. దీక్ష విరమించిన అనంతరం జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఎదుట తమ సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్