కేరళకు చెందిన అర్షద్ నరిక్కొట్టు మెచెరి (20) బియాస్ కుండ్ వైపు ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లి మంచులో చిక్కుకుపోయాడు. మంచులో కదలలేని స్థితిలో ఉన్న అతను 112 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అటల్ టన్నెల్ సమీపంలో ఉన్న ఎస్ఐ రాజ్ కుమార్, పోలీసు బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధుండి వంతెనకు 2-3 కిలోమీటర్ల ఎగువన లోతైన మంచులో చిక్కుకున్న అర్షద్‌ను ఎస్ఐ రాజ్ కుమార్, తన బృందంతో కలిసి వీపుపై మోసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.