AP: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ 21న విజయవాడలో నిరసన ర్యాలీ నిర్వహించతలపెట్టింది. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని మాచవరం పోలీసులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు నోటీసులు జారీ చేశారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.