ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం మల్లయ్యపాలెం సమీపంలో ముళ్లపొదల్లో చిక్కుకున్న జింక పిల్లను పోలీసులు చాకచక్యంగా రక్షించారు. కాలికి తీవ్ర గాయమైన జింక పిల్లను ఎస్ఐ నాగరాజు ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. సమయానికి స్పందించి మూగజీవి ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్తులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.