AP: బాపట్ల జిల్లా, చీరాలలో ఆరు నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లి దగ్గర నిద్రిస్తున్న శిశువును అపహరించినట్లు గుర్తించిన పోలీసులు, ఈ కేసులో సంజీవరావు, శ్రీను, టంగుటూరు దగ్గర ఆదినారాయణ, తిరుమల దంపతులను అరెస్ట్ చేశారు. సంతానం లేని కారణంగా ఆదినారాయణ దంపతులు శిశువును కిడ్నాప్ చేయించినట్లు విచారణలో తేలింది. శిశువును తెచ్చిస్తే రూ.1 లక్ష ఇస్తామని నిందితులకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. .