AP: గుంటూరు GGH అత్యవసర విభాగం వద్ద పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వార్డు డోరు మూసివేసి, వేరే రోగిని చూడటానికి వచ్చిన తనను అనుమతించలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రి గేట్లు ఎలా మూసేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.