రాహుల్ గాంధీపై 'మిస్సింగ్' పోస్టర్లు... ఢిల్లీలో రాజకీయ దుమారం

7066చూసినవారు
రాహుల్ గాంధీపై 'మిస్సింగ్' పోస్టర్లు... ఢిల్లీలో రాజకీయ దుమారం
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'కనిపించడం లేదు' అంటూ ఆదివారం వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఫిరోజ్‌షా రోడ్డుతో పాటు పలు కూడళ్లలో ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికల సమయంలో రాహుల్ దేశంలో ఉండరని బీజేపీ విమర్శలు చేస్తున్న మరుసటి రోజే ఈ పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్