AP: అధికార టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కొలికపూడి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ కేశినేని చిన్ని బాధితులు వచ్చే నెల 2న హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి కొలికపూడి హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది. కొలికపూడి నిర్ణయంతో టీడీపీలో దుమారం రేగుతోంది.