AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాలుష్య నియంత్రణ బోర్డు కదిలింది. సోషల్ మీడియాలో ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మా సిటీలో తనిఖీలు చేసిన పీసీబీ అధికారులు కంపెనీల్లో నమూనాలు సేకరించారు. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపునీటి కాలువల్లోకి విడుదల చేసినట్లు గుర్తించారు. ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది.