AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2026 పరీక్షలో 91.37 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మంగళవారం ఫలితాలను ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 1,63,008 మందిలో 1,48,950 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 93.57%, బాలురు 89.88% ఉత్తీర్ణత సాధించారు. 16 మంది విద్యార్థులు 120/120 మార్కులతో టాప్ ర్యాంకులు పొందారు. 265 పాలిటెక్నిక్ కాలేజీల్లో 84 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.