ఏప్రిల్ 9న అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే, చివరి నిమిషంలో బాంబే హైకోర్టు గోవాలోని పోండా అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉపఎన్నికను రద్దు చేసింది. ఏడాది లోపు అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఉపఎన్నిక అనవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని తీర్పు వెలువరించింది.