పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ 2' చిత్రంలో నటి పూజా హెగ్డేకు నటించే అవకాశం దక్కిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా సరైన విజయాలు లేక అవకాశాలు తగ్గిన పూజా హెగ్డేకు ఇది కీలక మలుపు కానుంది. 'ఓజీ'కి కొనసాగింపుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె హీరోయిన్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.