మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యూస్ ఛానల్‌పై నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొన్ని న్యూస్ ఛానల్స్ బ్లాక్‌మెయిలింగ్ బాక్సుల్లా మారాయని ఆమె విమర్శించారు. తనపై జరిగిన దాడులను గుర్తుచేసుకుంటూ, రాజకీయాల వల్ల నష్టపోయిన తన పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె పేర్కొన్నారు. ఆమె ట్వీట్లు వైరల్ అవ్వడంతో పాటు, మద్దతుతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.