ఏపీలో కేవలం రూ.5.10 లక్షలకే సొంత ఇల్లు నిర్మించుకునే రోజులు రానున్నాయి. భవన నిర్మాణంలో 'త్రీడీ (3D) కాంక్రీట్ ప్రింటింగ్' టెక్నాలజీతో ఇళ్లు నిర్మించే సరికొత్త ప్రాజెక్టుకు రాష్ట్రం నుంచే అంకురార్పణ జరగబోతుంది. మొదటి దశలో భాగంగా బుర్రిపాలెంలో 100 త్రీడీ ఇళ్లను నిర్మించనున్నారు. వీటితో పాటు గుంటూరు రూరల్ పరిధిలోని ఓబుల్నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మరో 77 ఇళ్లను నిర్మించి వారికి ఇవ్వనున్నారు. ఈ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.