కావలి ఆసుపత్రిలో రోగులకు నాసిరకం భోజనం! (వీడియో)

8చూసినవారు
AP: నెల్లూరు జిల్లా కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అరకొరగా, నాసిరకం భోజనం అందిస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి కడుపునిండా, నాణ్యమైన భోజనం అందడం లేదని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన ఆహారం కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రోగుల ఆరోగ్యం కుదుటపడాలంటే పౌష్టికాహారం అవసరమని, నాసిరకం భోజనంతో రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్