పదవులు, అధికారం శాశ్వతం కాదు: స్పీకర్ అయ్యన్న

42చూసినవారు
పదవులు, అధికారం శాశ్వతం కాదు: స్పీకర్ అయ్యన్న
AP: మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లేఅవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రి అనగానిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం కాదన్నారు. కూటమి హయాంలో ఏం చేశామో అదే ముఖ్యమన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని, ఎన్టీఆర్, ఇందిరాగాంధీనే ఓడించిన ప్రజలు మన వాళ్లని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :