AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకే
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవులు వస్తాయని తెలిపారు. మరో రెండేళ్లలో
ఎన్నికలు వస్తాయని, అప్పుడు
జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తనను
జగన్ చంపాలని చూసినట్లు ఎమ్మెల్యే యరపతినేని అంటున్నారని, ఆయన వ్యాఖ్యలు పాత సినిమాల్లోని సన్నివేశాలను తలపిస్తున్నాయన్నారు.