అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: గుడివాడ అమర్నాథ్ (వీడియో)

1చూసినవారు
AP: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ‘అధికార పక్షానికి కొమ్ముకాసి వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం. వైసీపీ అభ్యర్థులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడొద్దు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్