శక్తివంతమైన “టైఫూన్ బవి” అమెరికాలోని గ్వామ్‌ను తాకింది. ఈ తుఫాన్ కారణంగా గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్టు
అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. దీంతో గ్వామ్‌లో భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో నష్టం సంభవించే అవకాశం ఉండటంతో రక్షణ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.