ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ 150 పరుగులు చేయగా, ముంబై 123 పరుగులు చేసింది. 77 నాటౌట్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ, పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరిని టార్గెట్ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నామని, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రాలపై దాడి చేయాలని అనుకున్నామని తెలిపాడు. మూడు ఫార్మాట్లలో ఆడడం అంత సులభం కాదని, తన షాట్లను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తానని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడతానని తెలిపాడు.