ప్రభాస్ 'ఫౌజీ' డిసెంబర్ 3న విడుదల?

6856చూసినవారు
ప్రభాస్ 'ఫౌజీ' డిసెంబర్ 3న విడుదల?
సలార్, కల్కి 2898 చిత్రాలతో సక్సెస్ అందుకున్న ప్రభాస్‌కి 'రాజాసాబ్' రూపంలో డిజాస్టర్ తగిలినా.. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో 'ఫౌజీ' విడుదల తేదీపై చర్చ జరుగుతోంది. ఆగస్టులో రావాల్సి ఉండగా, షూటింగ్ సమస్యల వల్ల అక్టోబరు-నవంబరుకు వాయిదా పడిందని, తాజాగా డిసెంబర్ 3న విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నెలలో వచ్చిన సలార్, అఖండ, పుష్ప, పుష్ప 2 వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్