యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా మారి 'పిఆర్ షో' బ్యానర్‌పై కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, అశ్వత్ మరిముత్తు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'ది ఆల్ఫా యూనిట్' పేరుతో ఆరుగురు సభ్యుల బృందం దర్శకత్వం వహించనుంది, కథను ప్రదీప్ రంగనాథనే అందించారు. అనౌన్స్‌మెంట్ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.