PMSYM: ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్

20366చూసినవారు
PMSYM: ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, నెలకు రూ.15 వేలలోపు ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులు. పథకంలో చేరిన వారు నెలకు రూ.60 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. ప్రభుత్వం కూడా సమాన మొత్తాన్ని జమ చేస్తుంది. 60 ఏళ్లు పూర్తయ్యాక లబ్ధిదారులకు నెలకు రూ.3,000 పింఛన్ లభిస్తుంది. దరఖాస్తు కోసం ఆధార్, బ్యాంక్ ఖాతా ఉంటే సమీప CSC కేంద్రంలో నమోదు చేసుకోవచ్చు

సంబంధిత పోస్ట్