Top 10 viral news 🔥

ఆస్తి తగాదాలతో తల్లి, కొడుకు దారుణ హత్య
AP: అనంతపురం జిల్లా శింగనమల తరిమెల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా అంగన్వాడీ టీచర్ యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్న (22) దారుణంగా హత్యకు గురయ్యారు. నల్లప్ప రెండో భార్య అయిన యల్లమ్మ, ఆమె కుమారుడిని మొదటి భార్య కుమారులే ఆస్తి వివాదాల నేపథ్యంలో హతమార్చినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






































