ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత (వీడియో)

311చూసినవారు
AP: మురసు తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గరిష్ఠ స్థాయికి చేరింది. అధికారులు గురువారం బ్యారేజ్ మొత్తం 70 గేట్లను ఎత్తి, 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రంలోకి విడుదల చేశారు. తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్యారేజీలోకి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులకు చేరడంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్