ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను యూటీయఫ్ ఖండించింది

396చూసినవారు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను యూటీయఫ్ ఖండించింది
పశ్చిమ ఆసియాలోని ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను యూటీయఫ్ సీనియర్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి ఖండించారు. మంగళవారం సాయంత్రం గిద్దలూరు యూటీయఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచానికి ముప్పుగా మారిందని ఆయన అన్నారు. గత 38 రోజులుగా జరుగుతున్న ఈ దాడులను వెంటనే ఆపాలని, యుద్ధ విరమణ చర్యలు తీసుకోవాలని యూటీయఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదంతో వెనుజుల అధ్యక్షులు మధురోను, అతని భార్యను అన్యాయంగా అపహరించి జైల్లో బంధించారని జెవివి నాయకులు స్వరూపరెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్