
తుఫాన్ పరిసర ప్రాంతాలలో పర్యటించిన లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి, అధికారుల నుంచి తుఫాను పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని ఆమె సూచించారు.






































