33 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

306చూసినవారు
33 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా దొనకొండలో అక్రమంగా తరలిస్తున్న 33 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం వేకువజామున సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు ఎస్సై టి. త్యాగరాజు తెలిపారు. ఆటో డ్రైవర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, గంగదేవిపల్లిలోని రేషన్ దుకాణం-8ను ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాధాకృష్ణ తనిఖీ చేయగా, రెండు క్వింటాళ్ల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించి 6-ఏ కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్