ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పోలవరం, ముండ్లమూరు గ్రామాల్లో బుధవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి తిరుమలరావు మాట్లాడుతూ, రబీ 2025–26 సీజన్లో సాగు చేసిన ప్రతి పంటను రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పంట బీమా, పెట్టుబడి రాయితీ, ఇతర పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.