ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మద్యం మత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన సంఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను ఢీకొన్న కారు, అనంతరం మోటార్ సైకిల్ ను కూడా ఢీకొట్టింది. కారు నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో కారులోంచి రోడ్డుపై పడిపోయాడు. గాయపడ్డ వారిని స్థానికులు దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు.