ప్రకాశం జిల్లా దర్శిలో బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ పత్రాలను ఆదివారం అందజేశారు. ఈనెల 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ అర్జున్ రావు తెలిపారు. ఓటర్లు సకాలంలో పత్రాలను పూర్తి చేసి, ధ్రువపత్రాలను జత చేసి బీఎల్వోలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బీఎల్వోలకు సహకరించాలని ఆయన కోరారు.